విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం పాత బస్టాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. బస్టాండ్ సమీపంలోని ఓ షాప్ వద్ద స్టీల్ గ్రిల్స్‌కు ఉరి వేసుకొని చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. మృతుడికి సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. మృతుడు కొద్దిరోజులుగా స్థానిక బస్టాండ్ ప్రాంతంలో మతిస్థిమితం లేకుండా తిరిగే వాడని... బస్టాండ్ సమీపంలోని వ్యాపారులు చెబుతున్నారు. చేతికి రాగి కడియం ధరించి.. సుమారు 5.6 ఎత్తు ఉండొచ్చునని పోలీసుల తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
నర్సీపట్నం పాత బస్టాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం - నర్సీపట్నం పాత బస్టాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం పాత బస్టాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి.. శరీరంపై తెలుపు రంగు, బ్రౌన్ రంగు గీతాల షర్ట్, లుంగీ ధరించి ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
నర్సీపట్నం పాత బస్టాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహాం గుర్తింపు