విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం సూరెడ్డిపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరి యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సూరెడ్డిపాలెం గ్రామం నుంచి కె.కోటపాడుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. సూరెడ్డిపాలెం గ్రామ సమీపంలోని మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం మధ్యలో కూర్చున్న జాజిమొగ్గల ప్రేమకుమార్ (19) అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులు సాయి, ఆనంద్ కుమార్ తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కె.కోటపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు ఏ.కోడూరు ఎస్సై అప్పలనాయుడు తెలిపారు.
చెట్టును ఢీకొన్న ద్విచక్రవాహనం.. యువకుడు మృతి - కె.కోటపాడు ప్రభుత్వ ఆసుపత్రి
విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం సూరెడ్డిపాలెంలో ప్రమాదం జరిగింది. గ్రామ సమీపంలోని మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
చెట్టును ఢీకొన్న ద్విచక్రవాహనం