విశాఖ జిల్లా అనకాపల్లి పాత బస్టాండ్ వద్ద పాత భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. గౌరీ స్టీల్ ట్రేడర్స్ పేరుతో పాత భవనంలో దుకాణం నడుస్తుండగా ఉన్నట్టుండి స్లాబ్ పడిపోయింది. ఆ సమయంలో దుకాణంలో ఉన్న యజమాని నూకరాజు, పనిచేసే వ్యక్తి బోయిన రమణ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భవనం తడిసిముద్దై... స్లాబ్ కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
అనకాపల్లిలో పాత భవనం కూలి ఇద్దరు మృతి - Old building collapses in Anakapalle News
పాత భవనం కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి పాత బస్టాండ్ వద్ద జరిగింది. నివర్ తుపాన్‌తో నెమ్మెక్కిన స్లాబ్ దుకాణ యాజమాని, అక్కడే పని చేసే వ్యక్తిపై పడటంతో అక్కడికక్కడే చనిపోయారు.
అనకాపల్లిలో పాత భవనం కూలి ఇద్దరు మృతి