ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీడియో మార్ఫింగ్ వ్యవహారంలో ఇద్దరు వైదికుల సస్పెన్షన్.. - video morphing

సింహాచలం దేవస్థానంలో ఇద్దరు వైదికులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఈవో ఎం.వి. సూర్యకళ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల చోటు చేసుకున్న వీడియో మార్ఫింగ్ వ్యవహారానికి సంబంధించి వీరిపై చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

వైదికుల సస్పెన్షన్
వైదికుల సస్పెన్షన్

By

Published : Jul 18, 2021, 12:18 PM IST

సింహాచలం దేవస్థానంలో ఇటీవల చోటు చేసుకున్న వీడియో మార్ఫింగ్ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు వైదికులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఈవో ఎం.వి. సూర్యకళ తెలిపారు. ఓ వేద పండితుడు రూపొందించిన వీడియోను ఇంఛార్జ్ ఆలయ ప్రధానార్చకుడైన గొడవర్తి శ్రీనివాసాచార్యులుకు పంపగా.. ఆయన ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పలువురికి పంపించినట్లు తేల్చారు. ఈ మేరకు వారిద్దరితో పాటు మరో ఏడుగురికి ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటీసులకు సమాధానం అందుకున్న తర్వాత మార్ఫింగ్​కు కారణమైన వీరిద్దరిపై చర్యలకు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్​ ఆలయ ఈవోకు సిఫార్సు చేశారు. తాజా ఆదేశాల మేరకు వీరిని సస్పెండ్ చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details