అటవీ హక్కుల చట్టం ప్రకారం తమకు అడవిపై హక్కు కల్పించాలని విశాఖలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు కదం తొక్కారు. అటవీ శాఖ చట్టంతో గిరిజన ప్రాంతంలో అభివృద్ధి జరగట్లేదని వాపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలంటూ కోరారు. గిరిజన ప్రాంతంలో అటవీ హక్కు చట్టం పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐ.టి.డి.ఎ ముట్టడికి యత్నించిన గిరిజనులను పోలీసులు అడ్డుకున్నారు.
అడవిపై హక్కు కల్పించాలని.. విశాఖలో గిరిజనుల ఆందోళన - ఆందోళన చేస్తున్న గిరిజనులు
అడవిపై హక్కులు కల్పించాలని విశాఖలో గిరిజనులు ఆందోళన బాట పట్టారు. ఐటిడిఎ ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఐ.టి.డి.ఎ ముట్టడించిన గిరిజనులు