ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్‌కార్డులను ఈకేవైసీ చేయించుకునేందుకు బయోమెట్రిక్ అవసరం. గ్రామంలో సెల్ సిగ్నల్స్ లేక... విశాఖ జిల్లా హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ మజ్జివలస గ్రామస్థులుఇలా అడవి దారి పట్టారు.సుమారు 12 కిలోమీటర్ల దూరం కాలినడకన వచ్చి కొండల దగ్గర సిగ్నల్స్ రాక ఈకేవైసీ చేయించుకోవటానికి గుంపులు గుంపులుగా మూగారు. చిన్నాపెద్దా... ముసలి ముతక అనే తేడా లేకుండా 12 కిలోమీటర్ల దూరం నడిచుకొని వచ్చి ఈకేవైసీ చేయించుకుంటున్నారు. తమ గ్రామంలోకి ఏ నెట్వర్క్ సిగ్నల్స్ రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అవస్థలను చూసైనా ప్రభుత్వం ఈ ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.
శ్రీకాకుళంలోనూ అవే అవస్థలు