ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు సాగులో ఉన్నవారికి పట్టాలను పంపిణీ చేయునున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమే అని… వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న పేర్కొన్నారు. అయితే విశాఖ ఏజెన్సీలో 11 మండలాల్లోనే పట్టాలు ఇస్తామని చెబుతున్నారని, మైదాన గిరిజనుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
'సాగులో ఉన్న పోడు, అటవీ భూములకు పట్టాలివ్వాలి' - చీడికాడ తాజా వార్తలు
గిరిజనుల సాగులో ఉన్న పోడు, అటవీ భూములకు పట్టాలు ఇవ్వాలని… ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా చీడికాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గిరిజనులు భౌతికదూరం పాటించి నిరసన గళం విప్పారు. ప్లకార్డులను ప్రదర్శించి ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
మైదాన ప్రాంతంలో ఉన్న చీడికాడ, మాడుగుల, దేవరాపల్లి, రావికమతం, రోలుగుంట, గోలుగొండ, నాతవరం, కోటవురట్ల మండలాల్లోని 112 గ్రామాలకు చెందిన గిరిజనులు అటవీ, పోడు భూములను పూర్వీకులు నుంచి సాగుచేసుకొని జీవనం సాగిస్తున్నారని వివరించారు. గతంలో ఆయా మండలాల్లో గిరిజనులు రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకున్నామని… రెవెన్యూ, అటవీశాఖ అధికారులు మాత్రం గిరిజనులు పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించి మైదాన ప్రాంతంలో సాగులో ఉన్న గిరిజనులు అందరికీ సాగుహక్కు పట్టాలు ఇవ్వాలని కోరారు.