ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా జనవరి 8న దేశవ్యాప్త సమ్మె' - సీఐటీయూ న్యూస్

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జగ్గునాయుడు తెలిపారు. వచ్చే నెల 8న సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Trade unions All India protest on january 8th
విశాఖలో సీఐటీయూ సదస్సు

By

Published : Dec 21, 2019, 5:55 PM IST

కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్న సీఐటీయూ నాయకులు
కేంద్రంలో భాజపా అధికారం చేపట్టినప్పటి నుంచి.. దేశంలో కార్మికులు అణచివేతకు గురవుతున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఆరోపించారు. విశాఖలో మాట్లాడిన ఆయన.. భాజపా అనుసరిస్తోన్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 8న అఖిలపక్ష కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. ఈ విషయంపై చర్చించడానికి విశాఖలో ట్రేడ్ యూనియన్లు సదస్సు నిర్వహించాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ భాజపా సర్కారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పారిశ్రామిక అభివృద్ధి దెబ్బతిందని జగ్గునాయుడు విమర్శించారు. ఈ సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details