విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని జీవీఎంసీ షాపింగ్ మాల్ దుకాణాల బకాయిలు రూ.20 లక్షలకు చేరటంతో... బకాయిలను వసూలు చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న ఈ దుకాణాల్లో వ్యాపారాలు అద్దె చెల్లించడంలో జాప్యం చేస్తూ వచ్చారు. ఫలితంగా చెల్లించాల్సిన బకాయిలు రూ.20 లక్షలకుపైగా పేరుకుపోయాయి. ఈ మొత్తాన్ని వసూలు చేయడంపై జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్ మూర్తి ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ అధికారులతో కలిసి దుకాణదారుల వద్దకు వెళ్లి.. బకాయిలు చెల్లించాలని కోరారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'అద్దె బకాయిలు చెల్లించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం'
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని జీవీఎంసీ దుకాణాల బకాయిలు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. లేకుంటే దుకాణ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనకాపల్లిలో వ్యాపారులతో మాట్లాడుతున్న జోనల్ కమిషనర్