విశాఖ జిల్లా పెదబయలు మండలం గంపరాయి వద్ద ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు చిన్నారులకు తలకు బలమైన గాయాలు కావటంతో అక్కడికక్కడే మృతిచెందారు. వేసవి సెలవులు అరకులోయలో గడిపి చిన్నాన్న, అత్తతో కలిసి స్వగ్రామం వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారులను అక్క తమ్ముడు స్వప్న, ముఖేష్ గా గుర్తించారు. ప్రమాదంతో ఘాట్‌రోడ్ రక్తసిక్తమైంది. చిన్నారుల మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
టిప్పర్ ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతి - gamparai
విశాఖ మన్యంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. టిప్పర్ లారీ ఎదురుగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
రోడ్డుప్రమాదం