విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం కె.జె పురంలో ఇండియా వన్ ఏటీఎం కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. సీసీ కెమెరాలకు తెలుపు రంగు పూసి… ఏటీఎం యంత్రం కాల్చడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మంటలు చెలరేగాయి. యంత్రం ముందుబాగం కాలిపోయింది. వెంటనే దుండగులు పరారయ్యారు.
ఏటీఎంలో నగదు చోరీకి దుండగుల యత్నం - G madugula lo chori
విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం కేజే పురంలోని ఇండియా వన్ ఏటీఎంలో చోరీ యత్నం జరిగింది. ఏటీఎం యంత్రాన్ని తెరవడానికి ప్రయత్నించిన సమయంలో.. మంటలు వచ్చిన కారణంగా దొంగలు పరారయ్యారు.
Atm robbery at g. Madugula
గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాడుగుల ఎస్.ఐ రామారావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా.. నగదు చోరీకి గురికాలేదని తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.