విశాఖ జిల్లా గోపాలపట్నం కొత్తపాలెం శివారు ప్రాంతమైన భగత్ సింగ్ నగర్లో దొంగలు పడ్డారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దొంగతనం జరిగిందని ఇంటి యజమాని గుర్తించారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉందని ఇంటికి తాళం వేసి బయట పడుకోవటంతో దొంగలు పసిగట్టి దొంగతనానికి పాల్పడ్డారు.
గోపాలపట్నంలో ఓ ఇంట్లో చోరీ.. నగదు, బంగారం ఆపహరణ - విశాఖ జిల్లా వార్తలు
విశాఖ జిల్లా గోపాలపట్నం శివారు ప్రాంతంలో దొంగలు పడ్డారు. ఇంటి యజమాని ఇంటికి తాళం వేసి బయట పడుకున్నప్పుడు దొంగలు తమ చేతివాటం చూపించారు. సుమారు లక్షన్నర నగదు, రెండున్నర తులాలు బంగారం అపహరణ జరిగిందని యజమాని తెలిపారు.
గోపాలపట్నం నగర శివారులో దొంగతనం
సుమారు లక్షన్నర నగదు, రెండున్నర తులాలు బంగారం అపహరణ జరిగిందని పోలీసులు తెలిపారు. కాకినాడ రిజిస్ట్రేషన్ చెందిన ఒక ద్విచక్రవాహనములో వచ్చి చోరీకి పాల్పడి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇంటి నుంచి అర కిలోమీటర్ల దూరంలో తుప్పల్లో దొంగలు పడేసిన ద్విచక్రవాహనాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.