పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ప్రపంచ రికార్డు సాధించాడు. 12 గంటల పాటు నిర్విరామంగా పాఠాలు బోధించి ఆశ్చర్యపరిచాడు. తన ప్రతిభతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. విశాఖ జిల్లాలోని తురువోలు గ్రామానికి చెందిన చొక్కాకుల రామ్ కిరణ్..... చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఏకధాటిగా పదో తరగతి గణితాన్ని విద్యార్థులకు బోధించాడు. ఆ కార్యక్రమాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి ఆద్యంతం పర్యవేక్షించారు. అనంతరం రామ్ కిరణ్ పేరును వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో లిఖించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సర్టిఫికేట్‌ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.... ప్రపంచ రికార్డు సాధించిన బాలుడిని అభినందించారు. తన విజయం వెనుక ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉందని రామ్ కిరణ్ చెప్పాడు.
పదో తరగతి విద్యార్థి ప్రతిభ... ప్రపంచ రికార్డు దాసోహం - చోడవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థి రికార్డు
పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన తోటి విద్యార్థులకు గణిత పాఠాలు చెప్పాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 గంటల పాటు విరామం లేకుండా బోధించాడు. అతని ప్రతిభకు ప్రపంచ రికార్డు దాసోహమంది.
The tenth grade student holds the world record