విశాఖ జీవిఎంసీ వద్ద అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరసనలు 60వరోజులకు చేరుకుంది. కొవిడ్ సమయంలో వేలాది మంది ప్రాణాలు కాపాడుతున్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలనే ఆలోచనతో ప్రధాని మోదీ ముందుకు వెళ్లడం సరికాదని కార్మిక నేతలు వ్యాఖ్యానించారు.
పరిశ్రమ ప్రైవేటీకరణపై.. కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్, రైల్వే, బ్యాంకులు, ఎల్ ఐసీ , రక్షణ రంగం వంటి సంస్థలను ప్రైవేటుపరం కానివ్వబోమని ఐకాస నేతలు చెప్పారు.