ఈ నెల 30న జరగనున్న నర్సీపట్నం మున్సిపాలిటీ సమావేశాన్ని.. ఆన్లైన్లో నిర్వహించాలని నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్.. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని పంపించారు. ఊహించినదానికంటే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు ధృవీకరించిన నేపథ్యంలో.. నర్సీపట్నం పురపాలక సర్వసభ్య సమావేశాన్ని.. సాంకేతిక పద్ధతిలో నిర్వహించాలని ఆమె కోరారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతోపాటుగా పలు సమావేశాలు వాయిదా వేశారని గుర్తు చేశారు. నర్సీపట్నం పురపాలక సంఘంలోని కౌన్సిలర్ల ప్రత్యేక సమావేశాన్ని కూడా ఇదే పద్ధతిలో నిర్వహించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని చింతకాయల పద్మావతి విజ్ఞప్తి చేశారు.
'ఆన్లైన్లో సమావేశాన్ని నిర్వహించాలి..' - నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ తాజా వార్తలు
కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా.. మున్సిపాలిటీ సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహించాలని నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి కోరారు. ఈమేరకు అధికారులకు ఆమె వినతి పత్రాన్ని పంపించారు.
మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి