జలాశయాల ప్రధాన గట్లు బురదమయం
ఆ జలాశయాల ప్రాంతాలు సహజసిద్ధ ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటున్నాయి. కాని ఆ ప్రకృతి అందాలు తిలకించేందుకు వచ్చిన సందర్శకుల మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కొద్దిపాటి వర్షం కురిసినా... ప్రధాన జలాశయాల ప్రధాన గట్లు బురదతో అధ్వాన్నంగా తయారవుతున్నాయి.
విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం ప్రధాన గట్టు గతుకుల మాయమైంది. ఏ మాత్రం వర్షం కురిసినా.. గట్టు అంతా బురదగా మారుతుంది. దీంతో జలాశయం తిలకించేందుకు వచ్చిన సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భయంతోనే గట్టుపై రాకపోకలు సాగిస్తున్నారు. ఇదేవిధంగా చీడికాడ మండలం కోనాం జలాశయం ప్రధాన గట్టు కూడా అధ్వానంగా తయారైంది. వర్షం కురిస్తే గట్టు అంతా ఛిద్రంగా మారుతుంది. జలాశయం ప్రాంతాలను చూసేందుకు వస్తే... బురదతో ఇబ్బందులు తప్పలేదని పలువురు సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రైవాడ, కోనాం జలాశయాల ప్రధాన మట్టిగట్లు అభివృద్ధి చేయాలని సందర్శకులు, స్థానికులు కోరుతున్నారు..
ఇదీ చదవండి