చౌక ధరల దుకాణాలను ఉదయం 6 గంటలకే తెరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. ప్రజలకు సరుకుల పంపిణీలో ఎదురయ్యే సమస్యలను సత్వరమే పరీక్షించాలని చెప్పారు. అధికారులతో సమీక్షించిన ఆయన.. నిత్యావసర సరుకుల పంపిణీ వివరాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలన్నారు. మారికవలస, పరదేశపాలెంలో రేషన్ దుకాణాల్లో సరుకుల వివరాలు.. మొబైల్ పంపిణీ దుకాణాలను పరిశీలించారు. ధరల వివరాలు తెలుసుకున్నారు.
'ప్రతి రేషన్ షాపు ఉదయం 6 గంటలకే తెరవాలి' - లాక్డౌన్ కరోనా
విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్... జిల్లా పౌరసరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేషన్ సరుకుల అమలు తీరును తెలుసుకున్నారు.
పౌరసరఫరాల అధికారులతో విశాఖ జేసీ సమావేశం