ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యంలో ఆగని వానజల్లులు....ఇబ్బందుల్లో ప్రజలు. - vishakapatnam district

విశాఖ మన్యంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. కొన్నిచోట్ల రోడ్లు కోతకు గురై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

The hills are overflowing with the torrential downpours of rain. Roads have been eroded and vehicle traffic has stopped at vishakapatnam district

By

Published : Aug 5, 2019, 2:55 PM IST

మన్యంలో కురుస్తున్న వర్షాలకు ప్రధాన మత్స్య గెడ్డ జి.మాడుగుల, పాడేరు పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో ఉరకలు వేస్తుంది. పాడేరు మండలం రాయగడ వంతెనపై నీరు ప్రవహిస్తుంది. దీంతో కొండ దిగువన ఉన్న పల్లపు వరినాట్ల భూములు నీట మునిగాయి. లింగా పుట్టు వద్ద కల్వర్టు కోతకు గురై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. పెదబయలు మండలం ఇంజరిబ గెడ్డ పొంగిపొర్లగా....జి.మాడుగుల మండలం మద్దిగరువు కల్వర్టు కొట్టుకుపోయి నాలుగు రోజులు అవుతున్న రాకపోకలు పునరావృతం కాలేదు. బోయితలి, కిల్లంకోట పంచాయతీల గ్రామాలతోపాటు ఒరిస్సా కూడా రాకపోకలు నిలిచిపోయాయి. కొండల నడుమ ప్రవహిస్తున్న గడ్డలకు పరిసర గ్రామాలకు వెళ్లేందుకు గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మన్యంలో గత పది రోజులు నుండి వర్షం కురుస్తోంది.

మన్యంలో ఆగని వానజల్లులు....ఇబ్బందుల్లో ప్రజలు.

ABOUT THE AUTHOR

...view details