తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రథం తయారీకి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా విశాఖలోని సింహాచలం అప్పన్న స్వామి రథాన్ని.... రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ తూర్పుగోదావరి జిల్లా దేవాదాయ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ శేఖర్ పరిశీలించారు. సింహాద్రి అప్పన్న రథానికి మనుషులను నియంత్రించే బ్రేకుల పద్ధతి విధానం ఉందని పేర్కొన్నారు. ఈ నాలుగు చక్రాల బ్రేకులు పద్ధతి సింహాచలం రథానికి అతికినట్టు సరిపోయింది అన్నారు . అంతర్వేది రథానికి 6 చక్రాల తో నిర్మిస్తున్న బ్రేకుల విధానం ఏవిధంగా ఏర్పాటు చేయాలన్న విషయంపై పరిశీలిస్తున్నామని రామచంద్ర మోహన్ తెలిపారు.
అంతర్వేది రథం తయారీకి సింహాచలం అప్పన్న స్వామి రథం పరిశీలన..
అంతర్వేది రథం తయారీకి ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సింహాద్రి అప్పన్న రథానికి ఉన్న బ్రేకుల విధానాన్ని దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించారు.
సింహాచలం అప్పన్న స్వామి రథం పరిశీలన