విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర చేపట్టిన చాతుర్మాస దీక్షను నేడు ముగించారు. రిషికేశ్ వద్ద గంగానదిలో పుణ్యస్నానం చేసి దీక్షను విరమించారు. అనంతరం రుషికేశ్ వద్ద నుంచి బయలుదేరి సాయంత్రం విశాఖకు చేరుకోనున్నారు. ప్రతిఏటా తన చాతుర్మాస్య దీక్షను పవిత్ర గంగానదీ తీరంలో చేపట్టాలని పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సంకల్పించారు. ఈ ఏడాది జూలై 24వ తేదీన దీక్షను చేపట్టారు.
ముగిసిన విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష - sharadha peetadhipathula latest news
విశాఖ శారదా పీఠాధిపతులు చేపట్టిన చాతుర్మాస దీక్షను నేడు ముగించారు. అనంతరం రుషికేశ్ వద్ద నుంచి బయలుదేరి సాయంత్రం విశాఖకు చేరుకోనున్నారు.
విశాఖ శారదా పీఠాధిపతులు