ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిషికేశ్ వెళ్లిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు రిషికేశ్ వెళ్లారు. ఈ రోజు విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి డెహ్రాడూన్​ వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రిషికేశ్ చేరుకున్నారు.

vishaka
విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు

By

Published : May 15, 2021, 4:32 PM IST

చాతుర్మాస్య దీక్ష కోసం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర రిషికేశ్ వెళ్లారు. అక్కడి గంగాతీరంలో ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమంలోనే సెప్టెంబరు నెలాఖరు వరకు బస చేయనున్నారు. రిషికేశ్ బయలుదేరే ముందు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలోనే దేవతామూర్తులను దర్శించుకున్నారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిఏటా తన చాతుర్మాస్య దీక్షను పవిత్ర గంగానదీ తీరంలో చేపట్టాలని పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సంకల్పించారు. ఈ ఏడాది జూలై 24వ తేదీన ప్రారంభమయ్యే దీక్ష సెప్టెంబరు 20వ తేదీ వరకు ఉంటుంది. పీఠం నిర్వహణలోని జగద్గురు ఆదిశంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు సైతం పీఠాధిపతులతో కలిసి రిషికేశ్ వెళ్లారు. కరోనా ప్రబలకుండా పకడ్బందీగా వేద విద్యార్థులకు రక్షణ చర్యలు చేపట్టారు. పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్స్, మాస్కులు ధరింపజేసి ప్రత్యేక విమానంలో రిషికేశ్ తీసుకెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details