ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూలోకమాంబ, సుబ్రహ్మణ్యస్వామిల పంచరాత్రి మహోత్సవాలు ప్రారంభం - Bhulokamamba Pancha Ratri celebrations

విశాఖలోని భూలోకమాంబ, సుబ్రహ్మణ్యస్వామిల పంచరాత్రి మహోత్సవాలు ఈరోజు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో విద్యుత్ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Bhulokamamba and Subrahmanyaswamy Pancha Ratri celebrations start
భూలోకమాంబ,సుబ్రహ్మణ్యస్వామిల పంచ రాత్రి మహోత్సవాలు ప్రారంభం

By

Published : Nov 15, 2020, 2:45 PM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలోని భూలోకమాంబ, సుబ్రహ్మణ్యస్వామిల పంచరాత్రి మహోత్సవాలు ఈ రోజు లాంఛనంగా ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఉత్సవ కమిటీ కన్వీనర్, విశాఖ డెయిరీ సీఈవో ఆడారి ఆనంద్ కుమార్ ఈ వేడుకలను ప్రారంభించారు. ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో విద్యుత్ అలంకరణ ప్రత్యేకంగా నిలుస్తోంది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు ఈ జాతరకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details