ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 25, 2020, 12:04 PM IST

ETV Bharat / state

కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే : సీపీ ఆర్కే మీనా

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా విశాఖ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొందరు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. మాస్కు లేకుండా బయటికి వస్తే జరిమానా.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

cp rk meena
cp rk meena

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రత పాటించాలని సూచిస్తున్నారు. విశాఖ ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించాలని సీపీ ఆర్కే మీనా స్పష్టం చేశారు. మాస్కు లేకుండా బయటకు వస్తే రూ.100 జరిమానా విధిస్తామని తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా లక్షణాలతో ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details