అచెన్నాయుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని తెలుగుదేశం శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని తెలుగుదేశం మాజీ కౌన్సిలర్లు, నాయకులు... వైకాపా ప్రభుత్వం అవంలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.
అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ - ఈటీవీ భారత్ తాజా వార్తలు
అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని తెదేపా శ్రేణులు కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు. రాజకీయ కక్షపూరిత ప్రభావంతోనే అచ్చెన్నను అరెస్టు చేశారని కొవ్యొత్తులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా తెదేపా శ్రేణుల కొవ్వొత్తుల ర్యాలి
రాజకీయ కక్షపూరిత ప్రభావంతోనే అచ్చెన్నాయుడుని అరెస్టు చేశారంటూ తెదేపా నాయకులు కొవ్వొత్తులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి ఈ కార్యక్రమం ప్రారంభించారు.
ఇవీ చూడండి:బాబాయికి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత'