విశాఖ జిల్లా సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద తెదేపా కోర్ కమిటీ సభ్యులు ధర్నా చేశారు. అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు చాలా దారుణమని వైఎస్సార్ ప్రభుత్వం అంతర్గతంగా ప్రోత్సహిస్తుందని జిల్లా ఉపాధ్యక్షులు పాసర్ల ప్రసాద్ అన్నారు.
'రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది'
రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న అవకతవకలపై విశాఖ జిల్లా సింహాచలంలో తెదేపా కోర్ కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దోషులను వెంటనే శిక్షించాలని జిల్లా ఉపాధ్యక్షులు పాసర్ల ప్రసాద్ అన్నారు.
రాత్రి జీవో అమలు చేసి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్‌పర్సన్‌ను నియమించడం చాలా దారుణమని ఎద్దేవా చేశారు. అంతర్వేది కాకుండా మిగతా దేవాలయాల్లో జరిగిన దుర్ఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదంతా కేవలం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని.... దాడులు, దోపిడీలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. సింహాచలం భూ విభాగంలో పని చేస్తున్న ముగ్గురు పర్మినెంట్ ఉద్యోగులు సస్పెన్షన్ ఎత్తివేయడం చాలా దారుణమన్నారు. దేవాలయాలపై జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించి.. దోషులను తక్షణమే శిక్షించాలని అన్నారు.
ఇదీ చూడండి.పోలవరం బిల్లుల్లో రూ.760 కోట్లకు అర్హత లేదు: కేంద్రం