లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన పేదలను దాతలు ఆదుకోవాలని భీమిలి మండల తెదేపా అధ్యక్షుడు అప్పల నరసింహరాజు కోరారు. కరోనా వ్యాధి నుంచి ప్రజలంతా సురక్షితంగా బయటపడాలని కోరుతూ లక్ష్మీపురంలోని గ్రామ దేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధోని వెంకటరమణ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కార్యకర్తలు, నాయకులు సరకులు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు.
కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రత్యేక పూజలు - worship
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవాలని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని భీమిలి తెదేపా అధ్యక్షుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా బారి నుంచి ప్రజలు సురక్షితంగా బయటపడాలని కోరుతూ స్థానిక గ్రామదేవత ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు.
భీమిలి గ్రామదేవత ఆలయంలో పూజలు చేస్తున్న తెదేపా నాయకులు