వైకాపా దాడులపై ఎదుర్కొనేందుకు తెదేపా సన్నద్ధం అవుతుంది. జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటుచేసి..దాడులను తిప్పికొట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ చర్యలో భాగంగా విశాఖ తెదేపా కార్యాలయంలో ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశమైంది. విశాఖ జిల్లాలో తెదేపా నాయకులపై వైకాపా దాడుల చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు నేతలు తెలిపారు. ఈ సమావేశంలో చినరాజప్ప, సుజయకృష్ణ రంగారావు, ఉండి ఎమ్మెల్యే రామరాజు పాల్గొన్నారు. సమావేశ అనంతరం...విశాఖ మై క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గణేష్, శివ, చిన్మయకుమార్‌లను తెదేపా బృందం పరామర్శించింది.
తెదేపా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సరికాదు : చినరాజప్ప - chinarajappa
తెదేపా నేతలపై జరుగుతున్న దాడులను నిలువరించే పనిలో భాగంగా ఏర్పాటైనా త్రిసభ్య కమిటీ ఇవాళ విశాఖలో సమావేశమైంది. విశాఖ జిల్లాలో జరిగిన దాడులను చర్చించిన తెదేపా బృందం..ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సరికాదన్నారు. సమావేశానికి చినరాజప్ప, సుజయకృష్ణ రంగారావు, రామరాజు హాజరయ్యారు.
తెదేపా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సరికాదు : చినరాజప్ప
"తెదేపా శాసనసభ్యులు సమావేశాలకు వెళ్తే దాడులు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు పేర్లు మార్చుకుంటూపోతే మంచిది కాదు. ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేను పిలవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది " అని చినరాజప్ప అన్నారు.
ఇదీ చదవండి ;అభిమానం అదిరింది... తలపై వరల్డ్కప్!