ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో తెదేపా నేతల కొవ్వొత్తుల ర్యాలీ - అనకాపల్లి నేటి వార్తలు

అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్యల ఘటనను నిరసిస్తూ... విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో తెదేపా నేతలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

TDP  leaders conducted candle rally in anakapalli vizag district
అనకాపల్లిలో తెదేపా నేతల కొవ్వొత్తుల ర్యాలీ

By

Published : Nov 12, 2020, 11:25 PM IST

అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్యలపై... ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో తెదేపా నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల మృతికి కారకులైన వైకాపా నాయకులు, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సలాం కుటుంబసభ్యులకు కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details