కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విశాఖ తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... కరోనా రోగులకు పడకలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న వైకాపా సర్కార్... ప్రజలకు కొవిడ్ టీకా అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించి, ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు పెంచాలని డిమాండ్ చేశారు.
కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: పల్లా శ్రీనివాసరావు - palla srinivas latest news
కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు