ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసు దారుణానికి ఒడిగడితే.. సర్వీస్ నుంచి ఎందుకు తొలగించలేదు: వంగలపూడి అనిత

పోలీసు అధికారులు మహిళలపై దారుణానికి ఒడిగడితే.. వారికి కఠిన శిక్ష విధించకుండా సస్పెన్షన్​తో సరిపెట్టుకుంటారా అని.. తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర స్దాయిలో ధ్వజమెత్తారు. పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. ఓ యువతిని ప్రలోభపెట్టి మూడు నెలలుగా అత్యాచారం చేసిన.. ట్రాఫిక్​ సీఐని సర్వీస్ నుంచి ఎందుకు తొలగించలేదని మండిపడ్డారు. హోంమంత్రి దీనికి బాధ్యత వహించరా? అని ప్రశ్నించారు.

By

Published : Dec 28, 2021, 9:12 PM IST

tdp leader anitha fires on government over eluru ci suspension issue
తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత

పోలీసు దారుణానికి ఒడిగడితే.. సర్వీస్ నుంచి ఎందుకు తొలగించలేదు: వంగలపూడి అనిత

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో.. ఓ పోలీసు అంత దారుణానికి ఒడిగడితే.. సస్పెన్షన్​తో సరిపెట్టడం ఏమిటని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర స్దాయిలో ధ్వజమెత్తారు. వీరు పోలీసులా? కీచకులా? అని మండిపడ్డారు. కంచే చేను మేస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. ఓ యువతిని ప్రలోభపెట్టి మూడు నెలలుగా అత్యాచారం చేసిన.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణ ట్రాఫిక్​ సీఐ బాలరాజాజీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులే ఇలా ప్రవర్తించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఐపీసీ సెక్షన్ కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని ధ్వజమెత్తారు. నేరం రుజువైనప్పటికీ ఎందుకు సర్వీస్ నుంచి తొలగించడం లేదని, పోలీసు డిపార్ట్మెంట్ కాబట్టి ఉపేక్షిస్తారా? అని ధ్వజమెత్తారు. దిశ చట్టం గురించి.. సీఎం జగన్ గొప్పగా ఎన్ని ప్రసంగాలు చేశారని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details