ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రంథాలయాలు... విద్యార్థులకు జ్ఞాన వేదికలు - విశాఖ జిల్లా

వేసవి సెలవులు వచ్చాయంటే చిన్నారులకు సరదా. ఆనందంగా స్నేహితులతో ఆడుకోవచ్చని అనుకుంటారు. కానీ ఇది గతం. ఇప్పుడు పరిస్థితి మారిపోయి... వేసవి సెలవులనూ జ్ఞానం పెంపొందించుకోవడానికే వినియోగించుకుంటున్నారు.

నైపుణ్య తరగతులు

By

Published : May 15, 2019, 11:18 PM IST

నైపుణ్య తరగతులు

విశాఖ జిల్లాలోని పలు గ్రంథాలయాల్లో వేసవి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. 40 గ్రంథాలయాల్లో ఈ శిబిరాలు నడుస్తున్నాయి. విద్యార్థులు గ్రంథాలయాలకు వచ్చి ఆనందంగా గడుపుతున్నారు. జూన్ 7వరకు ఈ తరగతులు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. కథలు చెప్పడం, రాయడం నేర్పించడం, చిత్రలేఖనం, ఆంగ్లంపై పట్టు సాధించేందుకు నైపుణ్య తరగతులు, ఆటల్లో తర్ఫీదు ఇస్తున్నారు. ఈ వేసవి శిబిరాలకు రావడానికి విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఉపయోగరకంగా ఉందని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details