చోడవరంలో బడ్డీ వ్యాపారులు ఆందోళన... న్యాయం చేయాలని డిమాండ్ - latest protest in chodavaram
చోడవరంలో బడ్డీ వ్యాపారులు ఆందోళన నిర్వహించారు. తమ దుకాణాలను రహదారుల వెంబడి అధికారులు తొలగించారని... జీవనోపాధిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పని కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
చోడవరంలో బడ్డీ వ్యాపారులు ఆందోళన... న్యాయం చేయాలని డిమాండ్
విశాఖ జిల్లా చోడవరం పంచాయతీ కార్యాలయం ముందు బడ్డీదారులు, చిన్నదుకాణం దారులు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రహదారి పక్కన, రెవెన్యూ భూమిలో...తాము ఆధాపడిన దుకాణాలను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకొని జీవనోపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.