ఘనంగా రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు - visakha
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం నియోజకవర్గంలో సుబ్రతో ముఖర్జీ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ కప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
భీమిలి జీవీఎంసీ వుడా మినీ క్రీడా మైదానం, అమేయా, ఓక్రిడ్జ్ పాఠశాల క్రీడా మైదానాలు రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ కప్ పోటీలకు వేదికగా మారాయి. ఈ పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు ఆర్ డి ఓ తేజ్ భరత్, మంత్రి సోదరుడు ముత్తంశెట్టి మహేష్ ప్రారంభించారు. క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ ద్వారా అతిథులకు గౌరవ వందనం చేశారు. రెండు రోజులపాటు జరగబోయే ఈ పోటీలకు 39 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లు జాతీయ స్థాటికి నేరుగా ఎంపిక చేయబడతాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారిని జూన్ గాలియట్ తెలిపారు.