ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆన్​లైన్ యోగా చేసేయ్.. ఆరోగ్యాన్ని పట్టేయ్.. - ఆన్​లైన్ యోగా

కొవిడ్ ప్రభావం డిజిటల్ యుగాన్ని మరింత వేగవంతం చేసింది. మహమ్మారి దెబ్బతో గడప దాటలేని స్థితిలో ఎంతోమంది ఆన్​లైన్ బాట పట్టారు. ఈ నయా కల్చర్ వినియోగం.. విద్య, వైద్యం, వ్యాపారం ఇలా వివిధ రంగాల్లో బాగా కనిపిస్తోంది. అయితే ఆరోగ్యాన్ని కాపాడే మన వారసత్వ సంపద యోగా సైతం డిజిటల్ తెరపై తళుక్కుమంటోంది. ఆన్​లైన్ యాప్​లు ఇప్పుడు యోగా శిక్షణ కేంద్రాలుగా మారాయి. అంతర్జాల వేదికపై యోగాసనాలు సాధన చేస్తూ కరోనాపై పోరులో అవసరమైన శారీరక, మానసిక శక్తిని పొందుతున్నారు.

online yoga
ఆన్​లైన్ యోగా చేసేయ్.. ఆరోగ్యాన్ని పట్టేయ్..

By

Published : Oct 10, 2020, 1:41 PM IST

యోగా చేస్తే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని అందరికీ తెలుసు. ఎలాంటి ఆరోగ్య సమస్య నుంచి అయినా ఉపశమనం కలిగించే శక్తి యోగాకు ఉంది. అందుకే కొవిడ్​పై పోరులో యోగా సాధన ప్రాధాన్యతను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా చాలామంది అడుగు బయట పెట్టడానికి సంశయిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది.

ఈ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ ఆన్​లైన్ ద్వారా యోగా ప్రతి ఒక్కరికీ చేరువవుతోంది. కొవిడ్ కారణంగా యోగా శిక్షణ శిబిరాలకు వచ్చి సాధన చేసే అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే ఆన్​లైన్ ట్రెండ్​లో యోగా భాగమైంది. ఇంటినుంచి ఫోన్​లో ప్రత్యేక యాప్​లు వినియోగిస్తూ యోగా చేస్తున్నారు. ఆన్​లైన్ యోగా తరగతులు ఆస్వాదిస్తున్న వారిలో అన్ని వయసుల వారు ఉన్నారు. ఈ సరికొత్త అనుభూతి తమకు ప్రత్యేకంగా ఉందని అంటున్నారు.

కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో యోగామృతం ఎంతో దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ యోగా సాధనతో అంతర్గత శారీరక వ్యవస్థ పటిష్ఠం అవుతుందని సూచిస్తున్నారు. కొవిడ్ యోధుల్లో శ్వాస, గుండె సమస్యల్ని దూరం చేస్తుందని చెబుతున్నారు. ప్రాణాయామం శ్వాసకోశ వ్యవస్థకు చేసే మేలు గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నారు.

ఆన్​లైన్ యోగా తరగతులు స్నేహితులు, పరిచయస్తులు అంతా ఒకేచోట ఉన్నామనే ఆలోచన కలిగేలా చేస్తోంది. ప్రతిరోజూ ఉత్సాహంగా యోగా చేసేందుకు డిజిటల్ వేదిక సహకరిస్తోంది.

ఇవీ చదవండి..

మూడు శతాబ్దాలుగా ఆ గ్రామంలో మద్యపాన నిషేధం

ABOUT THE AUTHOR

...view details