ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మమ్మల్ని దక్షిణ కొరియాకు వెళ్లనివ్వండి' - ఎల్​జీ పాలిమర్స్ సాంకేతిక బృందం వార్తలు

తమను దక్షిణ కొరియాకు పంపించాలంటూ ఎల్టీ పాలిమర్స్ పరిశ్రమ పరిశీలనకు వచ్చిన ఆ దేశ జాతీయులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణల పేరుతో పోలీసులు ఆపేశారని వారి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

south korean expert team belongs to lg polymers filed a petition in high court
south korean expert team belongs to lg polymers filed a petition in high court

By

Published : Jun 23, 2020, 6:12 AM IST

ఎల్టీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీకి కారణం ఏంటనే విషయాన్ని పరిశీలించడానికి దక్షిణ కొరియా నుంచి వచ్చిన తమను... తిరిగి వెళ్లనీయడం లేదని ఎనిమిది మంది ఆ దేశ జాతీయులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై సోమవారం విచారణ జరిపింది. నిర్ణయాన్ని వెల్లడించేందుకు ఈ నెల 26కు వాయిదా వేసింది.

వీరికి ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సంబంధం లేదని సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు కావటంతో మే 13న విశాఖకు వచ్చారని వీరి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కోర్టుకు తెలిపారు. తిరిగి వెళ్లేందుకు పోలీసులు అనుమతించడం లేదన్నారు. విచారణల పేరుతో ఆపేశారని... వీరిని దక్షిణ కొరియాకు వెళ్లేందుకు అనుమతివ్వాలన్నారు. ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ... వారి నుంచి వివరాలు సేకరించేందుకే పోలీసులు నోటీసులిచ్చారని ధర్మాసనానికి తెలిపారు. భవిష్యత్తులో వారి అవసరం ఉంటే రావాల్సి ఉంటుందన్నారు. ఈ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... పోలీసుల అభ్యర్థన మేరకు వారు రాకపోతే హైకోర్టులో పిటిషన్ వేయవచ్చని సూచించింది. మరోవైపు గ్యాస్ లీక్​పై సుమోటోగా విచారణ జరుపుతున్న వ్యాజ్యాల్ని సైతం హైకోర్టు ఈ నెల 26 కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details