Somu Veerraju On Amaravathi: రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇప్పటికే అభివృద్ధి అయిన విశాఖలో ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని సవాల్ విసిరారు. బీసీ జనగణన విషయంలో వైకాపా ప్రభుత్వ తీరును సోము తప్పుబట్టారు. నిధుల కోసం రాష్ట్ర ఆస్తులను కాకుండా...సీఎం జగన్ తన సొంత ఆస్తులను తాకట్టు పెట్టాలని సోము వీర్రాజు అన్నారు.
Somu Veerraju On Amaravathi: రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: సోము వీర్రాజు - ap news
BJP Somu Veerraju On Amaravathi: రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. నిధుల కోసం రాష్ట్ర ఆస్తులను కాకుండా...సీఎం జగన్ తన సొంత ఆస్తులను తాకట్టు పెట్టాలని హితవు పలికారు.
"భాజపాలో బీసీలకు ప్రాధాన్యత కల్పించాం. 2024లో అధికారంలోకి రావాలని అమిత్ షా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతే ఉండాలి. అమరావతిలో రూ.1800 కోట్లతో ఎయిమ్స్ కట్టాం. విజయవాడలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. సీఎం జగన్ మడం తిప్పారు..మాట తప్పారు. విశాఖలో భూములు తాకట్టు పెడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం లోటస్‌పాండ్ తాకట్టు పెట్టొచ్చు కదా ?." - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: Centre on special status for AP: ప్రత్యేక హోదా ముగిసిన అంశం.. పార్లమెంట్లో కేంద్రం