విశాఖ జిల్లా దొండపర్తి డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయ అధికారులను పాము హడలెత్తించింది. మధ్యాహ్న సమయంలో ఎండ వేడిమికి తట్టుకోలేక కార్యాలయంలో ప్రవేశించింది. పామును చూసి భయపడిన అధికారులు బయటకు వచ్చేశారు. అనంతరం స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు. చివరకు డీఆర్ఎం కార్యాలయం ప్రధాన మార్గం వద్ద పామును పట్టుకున్నారు. ఆ తర్వాత రైల్వే అధికారులు తమ విధులకు హాజరయ్యారు.
రైల్వే అధికారులను హడలెత్తించిన పాము - దొండపర్తి
రైల్వే అధికారులను పాము హడలెత్తించింది. దొండపర్తి డీఆర్ఎం కార్యాలయంలో ప్రవేశించిన పామును చూసి అధికారులు బెంబేలెత్తారు. స్నేక్ క్యాచర్ వచ్చి పాము బంధించిన తర్వాత తిరిగి విధులకు హాజరయ్యారు.
రైల్వే అధికారులను హడలెత్తించిన పాము