విశాఖ గ్రామీణ జిల్లా చోడవరం నియోజకవర్గంలో 123 ఆలయాలు శ్రీ రామనవమి ఉత్సవాలకు ఆలయాలు ముస్తబువుతున్నాయి. కొవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని బుధవారం సీతారాముల కల్యాణం జరిపేందుకు ఆలయ కమిటీలు చర్యలు తీసుకుంటున్నాయి. కల్యాణం సందర్భంగా ఆలయాల వద్ద ఎటువంటి జనసముహం ఉండరాదని, అన్నసమారాధన వంటివి నిషేధించినట్లు చోడవరం పోలీసులు తెలిపారు. అతి తక్కువ మందితో సీతారామల కల్యాణం నిర్వహించుకోవాలని ఆలయ కమిటీలకు పోలీసులు సూచించారు.
'కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సీతారాముల కల్యాణ మహోత్సవాలు జరుపుకోవచ్చు' - chodavaram visakhapatnam
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సీతారాముల కల్యాణ మహోత్సవాలను నిర్వహించాలని చోడవరంలోని పలు ఆలయాల కమిటీలకు పోలీసులు సూచించారు. అన్నసమారాధన వంటి కార్యక్రమాలను నిషేధం ఉందని ప్రజలందరూ దీనికి సహకరించాలని వారు కోరారు.
చోడవరం పట్టణంలో అయిదు రామాలయాలు, అంజనేయ స్వామి ఆలయాలలో కల్యాణ మహోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో మట్టి విగ్రహాలతో సీతారాముల కల్యాణం జరిపేవారు. ఈ సారి కళ్యాణ మహోత్సవానికి ఓ భక్తుడు రూ.2.70 లక్షల వ్యయంతో తయారు చేసిన సీతారాముల విగ్రహాలను ఆలయానికి ఉచితంగా ఇచ్చారు. ఈ కొత్త విగ్రహాలతోనే కల్యాణం జరుపుతామని ఆలయ ప్రధాన అర్చకులు కె.ప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి:విశాఖ సెంట్రల్ పార్మసీ స్టోర్‌పై అధికారుల దాడులు