విశాఖపట్నంలోని సింహాచలం అప్పన్న ఆలయంలో 35 ఏళ్ల పాటు ప్రధాన అర్చకులుగా పనిచేసిన మోర్త సీతారామాచార్యులు (69) తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది శిష్యులను ఆయన తయారు చేసినట్లు దేవాదాయ వర్గాలు చెబుతుంటాయి. సీతారామాచార్యుల మృతి పట్ల దేవస్థాన అధికారులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సింహాచలంలోని ఆయన నివాసంలో సందర్శనార్దం ఉంచిన భౌతికకాయానికి దేవస్థాన ఉద్యోగులు శ్రద్దాంజలి ఘటించారు.
అనారోగ్యంతో సింహాచల ప్రధానార్చకులు మృతి
సింహాచలం అప్పన్న సన్నిధిలో చాలా కాలం పనిచేసిన ప్రధానార్చకులు మోర్త సీతారామాచార్యులు తీవ్ర అనారోగ్యంతో తనువు చాలించారు. సీతారామాచార్యుల మృతి పట్ల ఆలయ అధికారులు, ఉద్యోగులు సానుభూతిని తెలిపారు.
మృతి చెందిన సింహాచల ప్రధానార్చకులు