విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో తొలగించిన ఒప్పంద ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ.. ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ఆలయ ఈవో భ్రమరాంబకు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒప్పంద ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వారికి పూర్తి జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
'ఒప్పంద ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి' - సింహాద్రి అప్పన్న ఆలయం వార్తలు
సింహాద్రి అప్పన్న సన్నిధిలో తొలగించిన ఒప్పంద ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆలయ ఈవో భ్రమరాంబకు వినతిపత్రం అందజేశారు.
ఆలయ ఈవోకు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే గణేశ్