ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సమస్య తెలిసిన వారే సమస్య పరిష్కరించగలరు' - సింహాచలం భూ సమస్య

సింహాచలం భూ సమస్య పరిష్కారం కావాలంటే కమిటీలోని సభ్యులకు సమస్యపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అలాంటి వారిని వెంటనే నియమించకపోతే ఈ సమస్య ఎప్పటికీ తెగదని మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ పాతర్ల ప్రసాద్ ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు.

సమస్య తెలిసిన వారే పంచ గ్రామాల భూ సమస్య పరిష్కరించగలరు.

By

Published : Jul 26, 2019, 2:54 PM IST

సమస్య తెలిసిన వారే పంచ గ్రామాల భూ సమస్య పరిష్కరించగలరు.
సింహాచల దేవస్థాన భూ సమస్యలపై ప్రభుత్వం కమిటీ వేయడాన్ని తెలుగుదేశం స్వాగతిస్తోంది. కానీ సమస్య తెలిసిన ఎమ్మెల్యేలను తీసుకోకపోవడంతో సమస్య మరింత జఠిలమవుతుందే కానీ తగ్గదు. అదే పూర్తిగా అవగాహన ఉన్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్​ని కమిటిలోకి తీసుకోవడం వల్ల సులువుగా పరిష్కారమవుతుందని, వారిని వెంటనే కమిటీలోకి తీసుకోవాలని మాజీ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పాతర్ల ప్రసాద్ కోరారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిని ఆలయ ఈవో రామచంద్రమోహన్ తప్పుబట్టారన్నారు. అందుకే ఈ సమస్య పరిష్కారం కాలేదని, రామచంద్రమోహన్​ని వెంటనే కమిటీ నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆక్రమణదారులుగా చిత్రీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని.. ఈ సమస్యపై పూర్తిస్థాయిలో అవగాహన ఆలయ ఈవోకి లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details