వేదాంత్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న 'పనాచీ' లైఫ్‌స్టైల్ ఎక్స్పో ప్రదర్శన విశాఖ నగర మహిళలను ఆకట్టుకుంటోంది. చేనేత, అదునాతన ఆభరణాలతో కలిపి మొత్తం 42 స్టాల్స్‌తో ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కుర్తీస్, చుడీదార్స్, జ్యుయెలరీ వంటి ఐటమ్స్ యువతను ఆకట్టుకుంటున్నాయి. శ్రావణ మాసం సందర్భంగా 3వేల రూపాయల షాపింగ్ చేసిన వాళ్లకు ఒక సిల్వర్ కాయిన్ ఉచితంగా అందజేస్తామని నిర్వాహకులు సంతోషిణీ తెలిపారు. చేనేత కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ప్రదర్శనలో ఉచితంగా ఒక స్టాల్‌ను కేటాయించామన్నారు.
షాపింగ్ చేయండి...సిల్వర్ కాయిన్ పట్టండి
విశాఖలో నిర్వహిస్తున్న పనాచీ లైఫ్‌స్టైల్ ఎక్స్పో ప్రదర్శనలో 3 వేల రూపాయల షాపింగ్ చేస్తే... సిల్వర్ కాయిన్ ఉచితంగా ఇస్తామని నిర్వాహకురాలు సంతోషిణీ తెలిపింది.
షాపింగ్ చేయండి...సిల్వర్ కాయిన్ పట్టండి