ఉత్తరాంద్రలో ప్రముఖ జలవిద్యుత్కేంద్రంగా పేరుగాంచిన సీలేరుకు రెండో యూనిట్ గత మూడు నెలలుగా తలనొప్పిగా తయారైంది. ఈ రెండో యూనిట్ తరుచూ మరమ్మత్తులకు గురవుతుండటంతో విద్యత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. సీలేరులో 240 మెగావాట్లు సామర్థ్యం గల నాలుగు యూనిట్లున్నాయి. ఇందులో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రెండో యూనిట్ గత మూడు నెలలుగా ముప్పు తిప్పలు పెడుతోంది.
ఫిబ్రవరి నెలలో సర్వో మోటర్ సమస్యతో మూడు నెలలు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయగా, ప్రారంభించిన నాలుగురోజులకే రోటార్ ఎర్త్ సమస్య వచ్చింది. వారం రోజుల్లో సరిచేసి ఉత్పత్తి చేయగా... తాజాగా బుధవారం అదే యూనిట్ లో రోటార్ ఎర్త్ సమస్య వచ్చింది. దీంతో అధికారులు హుటాహుటిన జలవిద్యుత్కేంద్రానికి చేరుకుని సమస్య తెలుసుకునే ప్రయత్నం చేశారు. తరుచూ రోటార్ ఎర్త్ సమస్య వస్తుండటంతో ఎందువల్ల ఈ సమస్య వస్తుందోనని తెలుసుకోవడానికి అధికారులు రెండో యూనిట్‌ను అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుతం రెండో యూనిట్ మరమ్మతులకు గురికావడంతో మిగతా మూడు యూనిట్లుతో విద్యుదుత్పత్తిని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సీలేరు జలవిద్యుత్కేంద్రానికి రెండో యూనిట్ తలనొప్పి
సీలేరు జలవిద్యుత్కేంద్రంలో రెండో యూనిట్ తరచూ మరమ్మత్తులకు గురవుతుండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది.
సీలేరు జలవిద్యుత్కేంద్రానికి రెండో యూనిట్ తలనొప్పి
ఇదీ చదవండి