ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొరాపుట్​లో హిందూ ధర్మ ప్రచార యాత్ర

హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని కొరాపుట్ జిల్లాలోని పాడువా గ్రామాన్ని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సందర్శించారు. హైందవ ధర్మాన్ని అనుసరించడం ద్వారా మానవ జీవితం సార్థకమవుతుందని ఆయన అన్నారు.

By

Published : Mar 26, 2021, 7:46 PM IST

Published : Mar 26, 2021, 7:46 PM IST

hindu dharma prachara rally
హిందూ ధర్మ ప్రచార యాత్రలో స్వాత్మానందేంద్ర స్వామి

హిందూ ధర్మ ప్రచార యాత్రలో స్వాత్మానందేంద్ర స్వామి

హిందుత్వం మతం కాదని, భారతీయుల జీవన విధానమని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా స్వాత్మానందేంద్ర సరస్వతి ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని కొరాపుట్ జిల్లాలోని పాడువా గ్రామాన్ని సందర్శించారు. హైందవ ధర్మాన్ని అనుసరించడం ద్వారా మానవ జీవితం సార్థకమవుతుందని అన్నారు. అన్యమతస్థుల ప్రలోభాలకు లొంగి తల్లిలాంటి హిందూ మతాన్ని వదిలిపెట్టవద్దని ఆదివాసీలకు సూచించారు. ఆదివాసీ మహిళలకు విశాఖ శ్రీ శారదాపీఠం తరఫున చీరల పంపిణీ చేశారు.

ముందుగా తరిగొండ వెంగమాంబ భజన బృందాలు స్వామీజీకి స్వాగతం పలికాయి. ఆదివాసీలు తమ సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ గ్రామంలోకి తీసుకువెళ్లారు. పాడువా గ్రామంలోని సీతారామ మందిరాన్ని సందర్శించిన స్వాత్మానందేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ మతం పట్ల పాడువా గ్రామస్తులు చాటుతున్న అంకితభావాన్ని చూసి స్వాత్మానందేంద్ర స్వామి అభినందించారు. స్వామి వెంట స్థానిక ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఎంపీ మాధవి భర్త శివ తదితరులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details