ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక రీచ్​లను పరిశీలించిన ఎస్​ఈబీ అధికారి రాహుల్​దేవ్​ సింగ్​

స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారి రాహుల్ దేవ్ సింగ్ సిబ్బందితో కలిసి విశాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక రీచ్​లను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో చెక్​పోస్టులను ఏర్పాటు చేసేందుకు ప్రాంతాన్ని పరిశీలించారు.

SEB officer Rahul Dev Singh
ఇసుక రీచ్​లను పరిశీలించిన ఎస్​ఈబీ అధికారి

By

Published : Jun 15, 2020, 1:21 AM IST

విశాఖ జిల్లా స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారి రాహుల్ దేవ్ సింగ్ ఇసుక రీచ్​లను సందర్శించారు. సిబ్బందితో కలిసి గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామ పరిసరాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక రీచ్​లను ఆయన పరిశీలించారు. ఇక్కడ కొత్తగా అనుమతులు పొందిన బొడ్డేరు రీచ్​ వద్ద నూతనంగా ఏర్పాటు చేసేందుకు చెక్ పోస్ట్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాహుల దేవ్​ సింగ్​తోపాాటు ఇన్​స్పెక్టర్​ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details