విశాఖ జిల్లా అనకాపల్లిలో భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్)ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్థిక సంస్థలైన బ్యాంకులు, ఎల్ఐసీ వంటి సంస్థలను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకించారు. ఈ నెల 24 నుంచి 30 వరకు జరిగే సర్కార్ జాగో కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
అనకాపల్లిలో సర్కార్ జాగో నిరసన కార్యక్రమం - బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోకివాడ శ్రీరామమూర్తి
దేశంలో ఆర్థిక సంస్థలైన బ్యాంకులు, ఎల్ఐసీ వంటి సంస్థలను ప్రైవేటీకరణ చేయటాన్ని నిరసిస్తూ విశాఖ జిల్లా అనకాపల్లి భారతీయ మజ్దూర్ సంఘ్( బీఎంఎస్)ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు
బ్యాంకు ఉద్యోగుల 11వ వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోకివాడ శ్రీరామమూర్తి మహారాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో అన్నారు. వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని కోరారు. కుటుంబానికి ఇచ్చే పెన్షన్ పెంచాలని.. కార్మిక చట్టాల మార్పులు చేయడం మానుకోవాలని పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే విధంగా బ్యాంకు ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్పూర్తి, రాజు, మహేష్, అప్పారావు సంతోష్ పాల్గొన్నారు.