ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంతెన నీటిపాలు... ప్రజల కష్టాలు చూడు..!

విశాఖ జిల్లా దేవరాపల్లి వద్ద శారదానదిపై ఉన్న కాలిబాట వంతెన కొట్టుకుపోయింది. ఫలితంగా వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేరే దారిలేక అసంపూర్తిగా ఉన్న వంతెనపై నుంచి... ప్రజలు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు.

కొట్టుకుపోయిన శారదా నది కాలిబాట వంతెన

By

Published : Oct 25, 2019, 2:11 PM IST

కొట్టుకుపోయిన శారదా నది కాలిబాట వంతెన

​విశాఖ జిల్లా దేవరాపల్లి వద్ద శారదా నదిపై కాలిబాట వంతెన కొట్టుకుపోయింది. ఎగువన ఉన్న రైవాడ జలాశయం నుంచి భారీగా వరద రావటంతో గండిపడింది. దీంతో దేవరాపల్లి, అనంతగిరి, హుకుంపేట మండలాల్లోని దాదాపు 200 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ వంతెన పనులు రాష్ట్ర విభజన ముందు ప్రారంభించినా... నేటికీ పూర్తి కాలేదు. తాత్కాలికంగా నిర్మించిన వంతెన కోట్టుకుపోయింది.

ABOUT THE AUTHOR

...view details