విశాఖ జిల్లా పాడేరు మన్యంలో కరోనా విజృంభిస్తోంది. ఏజెన్సీలో ఇప్పటివరకు 376 మంది వైరస్ బారినపడ్డారు. పాడేరు రేకుల కాలనీలో ముగ్గురు కరోనా బారినపడి మృతి చెందారు. మన్యంలో గిరిజనుల కరోనా పట్ల తగు జాగ్రత్త వహించాలని అదనపు జిల్లా వైద్యాధికారి లీలా ప్రసాద్ సూచించారు.
పాడేరు పాలిటెక్నిక్ కళాశాలో సంజీవిని బస్సు - పాడేరులో కరోనా
విశాఖ పాడేరు మన్యంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాడేరు పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో సోమ, గురు ,శనివారాల్లో సంజీవిని బస్సు అందుబాటులో ఉంటుందని అదనపు జిల్లా వైద్యాధికారి లీలా ప్రసాద్ తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
గిరిజనులు ఆహారపు అలవాట్లు వల్ల కోవిడ్ తమను ఏమీ చేయలేదనే అపోహలో ఉన్నారని, ఇలాంటివి నమ్మవద్దని ఏడీఎంహెచ్ఓ చెప్పారు. వైద్యులు సూచించిన విధంగా సామాజిక దూరం .. మాస్క్ ధరించడం.. శానిటైజర్ వంటివి ఉపయోగించాలని చెప్పారు. టెస్టింగ్ కిట్లు కొరత గురించి ప్రశ్నించగా టెస్టులకు అవసరమైన విధంగా కిట్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. పాడేరు పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో సోమ, గురు, శనివారాల్లో సంజీవిని బస్సు అందుబాటులో ఉంటుందని కరోనా లక్షణాలు ఉన్నవారు టెస్టులు చేయించుకోవాలని ప్రకటించారు.
ఇదీ చూడండి.16 రోజులు.. 101 గ్రామాలు.. 250 వాల్ పెయింటింగ్స్