ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రద్దీగా మారిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్

దాదాపు 50 రోజుల తర్వాత సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ ప్రయాణికులతో కళకళలాడింది. లాక్​డౌన్ వేళ కేంద్రం ఇచ్చిన సడలింపులతో రైల్వేశాఖ ప్రత్యేకంగా కొన్ని రైళ్లను నడుపుతోంది.

By

Published : May 13, 2020, 8:46 PM IST

rush at secendrabad railway station
ప్రయాణీకులతో రద్దీగా మారిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్

ప్రయాణీకులతో రద్దీగా మారిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్

బెంగళూరు నుంచి న్యూదిల్లీ వరకు సికింద్రాబాద్‌ మీదుగా వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఇవాళ పట్టాలెక్కింది. బెంగళూరు రైల్వే స్టేషన్‌ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రైలు చేరుకుంది. రాజధాని ఎక్స్​ప్రెస్ రాకతో సికింద్రాబాద్ స్టేషన్ ప్రయాణికులతో కళకళలాడింది. 288 మంది ప్రయాణికులు దీనిలో ప్రయాణించారు. ప్రతి ప్రయాణికుడికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించిన అనంతరం అధికారులు వారిని స్టేషన్‌ లోపలికి అనుమతించారు. పటిష్ఠ బందోబస్తు మధ్య రైళ్లను నడుపుతున్నారు. రైళ్లలో కూడా భౌతికదూరం పాటిస్తూ కూర్చునేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇవీ చూడండి:'లెక్కల కన్నా ఎక్కువ మందే చనిపోయి ఉంటారు'

ABOUT THE AUTHOR

...view details