కనుచూపు మేరంతా పచ్చదనం... మధ్యలో చూడచక్కని జలపాతం. ఇదీ... విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలంలో ఉన్న కొత్తపల్లి జలపాతం. హొయలుపోతున్న ఈ ప్రకృతి అందాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యంలో వచ్చి సందడి చేస్తున్నారు. కార్తిక మాసం, అందునా ఆదివారం, సోమవారం వచ్చిన సందర్భంగా... సందర్శకులు భారీగా తరలివచ్చారు. స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యులు.. వారూ వీరూ అని తేడా లేకుండా.. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా... జలపాతం వద్ద తడుస్తూ సందడి చేశారు. జలపాత అందాలు కెమెరాల్లో బంధిచేందుకు ఉత్సాహం చూపించారు. సెల్ఫీలతో యువతీ యువకులు హంగామా చేశారు.
కొత్తపల్లి జలపాతం.. ప్రకృతి అందాల ప్రపంచం - news at kothapalli waterfalls
విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం జి.మాడుగుల మండలంలోని ప్రకృతి అందం... కొత్తపల్లి జలపాతం.. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జలపాతం అందాలను తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి చాలామంది నిత్యం తరలివస్తున్నారు.
కిక్కిరిసిన కొత్తపల్లి జలపాతం